ఫేక్‌ న్యూస్‌పై సీజేఐ ఆందోళన

ఫేక్‌ న్యూస్‌పై సీజేఐ ఆందోళన

ఢిల్లీ: సోషల్ మీడియాలో ఫేక్‌ న్యూస్‌పై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులపై అవాకులు.. చవాకులు పేలినవారిపై చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీజేఐ ఎన్వీ రమణ.. సోషల్ మీడియా వేదికలు న్యాయమూర్తులు చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు. శక్తివంతమైన వ్యక్తులను మాత్రమే పట్టించుకుంటున్నాయని,సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు మతం రంగు పులమడం ఆక్షేపణీయని సీజేఐ తెలిపారు. తబ్లీగి జమాత్ వ్యవహారంపై పిటిషన్ల విచారణ సందర్భంలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తాజాగా విడుదల చేసిన ఐటీ రూల్స్‌కు వ్యతిరేకంగా హైకోర్టులలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేసి విచారించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. అన్ని పిటిషన్లను కలిపి విచారించడంపై నిర్ణయం తీసుకునేందుకు కేసును 6 వారాల తర్వాత లిస్ట్ చేయాలని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. ఆ తర్వాతే సోషల్ మీడియా కేసులన్నీ సుప్రీంకోర్టుకు బదిలీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.