సలాం ఫ్యామిలీకి సీఎం జగన్ హామీ

తుంగభద్ర పుష్కరాల ప్రారంభం సందర్భంగా కర్నూలు జిల్లాకు వచ్చిన ఏపీ సీఎం జగన్ నంద్యాలలో ఇటీవల కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ సలాం అత్తగారు మాబున్నీసీతోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె కొడుకు కూతురును ఏపీఎస్పీ గెస్ట్ హౌస్ వద్ద సీఎం పరామర్శించారు.

సలాం కుటుంబానికి ఇటీవలే సీఎం జగన్ 25 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. ఆ సాయాన్ని అందించిన మీకు రుణపడి ఉంటామని సలాం అత్త మాబున్సీసా జగన్ కు విన్నవించింది. తన కూతురు సాజీదాకు ఉద్యోగం ఇవ్వాలని.. మా అల్లుడిని అనంతపురం నుంచి నంద్యాలకు బదిలీ చేయాలని.. దోషులను శిక్షించాలని సీఎంను సలాం అత్త మాబున్నీసా కోరారు.

ఈ సందర్భంగా సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులైన దోషులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని.. కుటుంబానికి అండగా ఉంటామని సలాం అత్త మాబున్నీసాకు జగన్ హామీ ఇచ్చి ధైర్యం చెప్పారు.

ఇక సీఎం ఆదేశాల మేరకు సలాం అత్త కొడుకు సీనియర్ అసిస్టెంట్ శంషావలిని అనంతపురం వైద్య ఆరోగ్యశాఖ నుంచి డిప్యూటేషన్ పై నంద్యాలకు బదిలీ చేశారు.