
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది.. ఊహించినట్టే బలపరీక్షలో సీఎం నారాయణస్వామి నెగ్గలేదు. తమ ప్రబుత్వవాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సిన సంఖ్యాబలాన్ని చూపించలేకపోయారు. సరైన సంఖ్యా బలం లేనందున అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే నారాయణస్వామి బయటకు వచ్చారు. అనంతరం అయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 33 స్థానాలున్నాయి.
కాగా కాంగ్రెస్ కూటమికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మొత్తం సభ్యులు సంఖ్య 26కి తగ్గింది. దీనితో కాంగ్రెస్ కూటమికి బలం 12కి తగ్గింది. మరోపక్క విపక్షమైన ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి బలం ప్రస్తుతం 14 (ఎన్ఆర్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్ బీజేపీ ఎమ్మెల్యేలు 3) గా ఉంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఆ కూటమిని లెఫినెంట్ గవర్నర్ తమిళిసై ఆహ్వానించే అవకాశముంది.