తెలంగాణలో అంత్యక్రియలకు హాజరైన 33 మందికి కరోనా

Corona for 33 people who attended funeral in Telangana
Corona for 33 people who attended funeral in Telangana

కరోనా వ్యాక్సిన్ వచ్చిందని ప్రజలు నిర్లక్ష్యంగా ఉండటం వలన కరోనా కేసుల సంఖ్య మళ్ళీ అధికం అవుతున్నాయి. తెలంగాణ లో తాజాగా కరీంనగర్ జిల్లాలో ఒకరి అంత్యక్రియలకు వెళ్లిన 33 మందికి కరోనా పాజిటివ్ రావడం తీవ్ర కలకలం రేపుతుంది. అయితే కరీంనగర్ జిల్లా చేగుర్తి మండలంలో 10 రోజుల క్రితం ఓ వ్యక్తి అనారోగ్యంతో చనిపోవడం తో ఈ అంత్యక్రియలకు దుర్శేడ్, మొగ్ధుంపూర్, చేగుర్తి గ్రామాల లోని వారు వచ్చారు వారిలో కొందరికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నడంతో వారికీ పరీక్షలు చేసినారు. అయితే వారిలో 33 మందికి కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. అయితే వీరిలో 32 మంది చేగుర్తి గ్రామస్తులే దీంతో ప్రభుత్వం ఈ రోజు కూడా గ్రామంలో మరింత మందికి కరోనా వైరస్ టెస్టులు చేయనున్నారు.