తెలుగు తేజం పీవి సింధు బయోపిక్ లో దీపికా పదుకునే ?

Deepika Padukone be ready for PV Sindhu biopic

 

పీవి సింధు.. యావత్ భారతదేశం గర్వపడేలా ఒలింపిక్ విజేతగా నిలిచిన తెలుగు తేజం. ప్రస్తుతం సింధు బయోపిక్ ను బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకునే యాక్ట్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. పీవీ సింధుకు, దీపిక రణబీర్ లు ముంబైలో ఆతిధ్యం ఇఛ్చారు. అప్పుడే సింధు బయోపిక్ లో దీపిక నటించడానికి సన్నాహాలు చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. రీసెంట్ గా వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. రాకెట్ తో సింధూతో ధీటుగా శ్రమించింది దీపికా. ఈ ప్రాక్టీస్ గురించి దీపికా తన సోషల్ మీడియాలో చాలా విషయాల్ని షేర్ చేసుకుంది. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొనే కుమార్తె దీపిక.

ఈ క్రమంలో సింధుతో కలిసి గేమ్ ఆడటం.. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సింధూ బయోపిక్ దీపికాతో పక్కా అంటూ వార్తలు వస్తున్నాయి. దీపిక, సింధు కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ పోస్ట్ బ్యాడ్మింటన్ గ్లో అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సింధూ బయోపిక్ విషయంలో ఈ వీడియోలు క్లారిటీ ఇచ్చారంటూ అభిమానులు ఆనందపడుతున్నారు. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏది ఏమైనా సింధూ బయోపిక్ లో దీపికా పదుకునే యాక్ట్ చేయడం అంటే బిగ్గెస్ట్ హిట్ గానే నిలుస్తుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. ఆమెకు ఈ సినిమా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.