సుప్రీంకోర్టులో రైతులకు ఊరట

Delhi Farmers Supreme Court

 

ఢిల్లీ సింఘు సరిహద్దు దగ్గర రైతుల ధర్నాపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టులో సింఘు పరిసర సోనిపట్ నివాసితులు పిటిషన్‌ దాఖలు చేశారు. సింఘు సరిహద్దును రైతులు అనధికారికంగా మూసివేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. జాతీయరహదారిని ఒక వైపు అయినా తెరిచేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే స్థానిక హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. సామాన్యుడి రోజువారీ సమస్యలను హైకోర్టు పరిశీలిస్తుంని సుప్రీం చెప్పింది. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు నిరాకరించింది. అంతే కాకుండా పిటిషన్ ఉపసంహరణకు అవకాశం కూడా కల్పించింది.