బర్డ్ ఫ్లూ నేపథ్యంలో రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల్లో చికెన్ తో తయారు చేసే పదార్థములతో పాటు గుడ్లతో చేసే వంటకాలను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సహా ఎనిమిది రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనట్లు ఇప్పటికే కేంద్రం అధికారికంగా ప్రకటించింది. నార్త్ ఢిల్లీ కార్పోరేషన్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం చికెన్ సహా ఫౌల్ట్రీ పదార్థములు ఎవైనా అమ్మటం, నిల్వ చేయటం నిషేధమని స్పష్టం చేశారు.
ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని, అందరూ సహాకరించాలని కోరారు. బర్డ్ ఫ్లూ వార్తల నేపథ్యంలో ఇప్పటికే చికెన్, గుడ్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. దేశంలో అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం అలర్ట్ చేసింది.