సంక్రాంతి బరిలోకి స్టార్ హీరోల సినిమాలు.. సై అంటున్న రాజమౌళి

Director SS Rajamouli About Sankranthi Box Office 2022 Competition

 

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంక్రాంతి ఫెస్టివల్ కి సినిమాలకు హై కాంపిటేషన్ ఉంటుంది. వచ్చే ఏడాది కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సినిమాలు క్యూ కట్టాయి. కంటెంట్ బావుంటే సినిమాలు సక్సెస్ అవుతాయనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే స్టార్ హీరోల సినిమాలంటే అభిమానులకు ఉండే ఆనందమే వేరు. సోషల్ మీడియా వేదికగా సినిమా ప్రమోషన్లు కూడా భారీ స్థాయిలోనే ఉంటాయి. ఈ విషయంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన సినిమాపై పూర్తి క్లారిటీ ఇచ్చేసారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన సినిమా భీమ్లా నాయక్ సినిమా జనవరి 12 వ తేదీన రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ విషయంలో దర్శకనిర్మాతల మధ్య చర్చలు సాగినా.. ఇప్పుడు సంక్రాంతికి సిద్ధంగా ఉన్నట్లు ఖరారు చేసింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర కాంపిటేషన్ మరింత ఎక్కువయ్యింది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా సంక్రాంతికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.

జనవరి 7 న రిలీజ్ అయ్యే ఈ సినిమా ప్రమోషన్లు ఇప్పటికే రెడీగా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు డిమాండ్ కూడా ఓ స్థాయికి చేరుకుంది. మరోపక్క ప్రభాస్, పూజా హెగ్దేలు కలిసి నటించిన సినిమా రాధేశ్యామ్ కూడా సంక్రాంతికే సిద్ధంగా ఉంది. జనవరి 14 న రిలీజ్ అవుతుందని సోషల్ మీడియా వేదికగా దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా పరిస్థితుల తర్వాత తమ ఫేవరెట్ తారల సినిమాలు ఇలా ఒక్కసారిగా రిలీజ్ కావడంతో ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేవు.

సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా హవా పూర్తిగా కనిపిస్తుంది. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా రాజమౌళి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లానాయక్ మాత్రమే కాదు.. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అన్నీ సినిమాలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు రాజమౌళి తెలిపారు.