సీతాఫలం తింటే బరువు పెరుగుతారా?

does custard apple increase weight

 

చూడగానే నోరూరించే సీతాఫలం రుచి ఇంకే పండులో ఉండదంటే అతిశయోక్తి కాదు. తియ్యతియ్యని ఈ పండు తింటే చాలు.. కడుపు నిండి పోతుంది కానీ మనసే నిండదు. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది. కేవలం కడుపు నింపడమే కాదు.. ఇందులో ఎన్నో పోషకాలు కూడా నిండి ఉన్నాయి. సీతాఫలంలో కేవలం కార్బొహైడ్రేట్లే కాదు.. ప్రొటీన్లు, ఫ్యాట్లు కూడా ఎక్కువగానే దొరుకుతాయి. వీటితో పాటు చాలా ఎక్కువ మోతాదులో విటమిన్ సి కూడా ఇందులో ఉంటుంది.

విటమిన్ బీ6, ఫోలిక్ యాసిడ్‌లతో పాటు బీ కాంప్లెక్స్ విటమిన్లు అన్నీ ఇందులో లభిస్తాయి. ఈ పండ్లలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్, కాపర్ వంటి మినరల్స్ కూడా లభించడం వల్ల.. వాటి లోపాలు ఏవైనా మన శరీరంలో ఉంటే ఈ పండు తినడం వల్ల అవి తొలిగిపోతాయి.

సీతాఫలం అంటే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఇష్టంగా ఇష్టపడి తింటుంటారు. అయితే సీతాఫలం ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ.. దీని విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి.

వాటిలో అధిక బరువు ఉన్న వారు సీతాఫలం తినకూడదు..తింటే మరింత వెయిట్ గెయిన్ అవుతారు అన్నది కూడా ఒకటి. ఈ క్రమంలోనే ఓవర్ వెయిట్ ఉన్న వారు, డైటింగ్ చేసే వారు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన సీతా ఫలాన్ని తినరు. కానీ, సీతాఫలం తింటే బరువు పెరుగుతారన్నది కేవలం అపోహ మాత్రమేనని అంటున్నారు నిపుణులు.

నిజానికి సీతాఫలంలో కొవ్వులు, క్యాలరీలు చాలా తక్కువగా.. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సీతా ఫలం తింటే వెంటనే కడుపు నిండుతుంది. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అదే సమయంలో త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. దీనివల్ల చిరు తిండ్లపై మనసు మల్లనే మల్లదు. ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.

అందుకే బరువు తగ్గేందుకు డైటింగ్ చేసే వారు డైట్‌లో సీతాఫలంను చేర్చుకుంటే మరింత ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవ్వొచ్చని అంటున్నారు నిపుణులు. పైగా సీతాఫలం తింటే జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడి.. గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలేవి దరి చేరకుండా ఉంటాయి. రక్త హీనత, గుండె సంబంధిత వ్యాధులు, ఆల్జీమర్స్ వంటి వాటికి కూడా దూరంగా ఉండొచ్చు.

సీతాఫలంలో నియాసిన్ అనే విటమిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో తోడ్పడుతుంది. దీంతో పాటు సీతాఫలంలో ఎక్కువగా ఉండే ఫైబర్ కూడా కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో తోడ్పడుతుంది. ఈ ఫైబర్ మన రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేసి గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా చేస్తుంది.