వెలుగొండ వాటర్ పాలిటిక్స్

ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు తాగు, సాగు నీరు అందించేందుకు నిర్మిస్తున్న వెలుగొండ ప్రాజెక్టు ప్రస్తుతం రాజకీయ విమర్శలకు సెంటర్ పాయింట్ గా మారింది. ప్రాజెక్టు మొదటి సొరంగంలో లీకేజీ రావడంతో టన్నెల్ లోకి నీరు చేరింది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు లో నాణ్యతా ప్రమాణాలు గాలికి వదిలేశారని ఆరోపించారు. నీటి లీకేజీ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారన్నారు.

అటు టీడీపీ నేతల విమర్శలను తిప్పికొట్టారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. కేవలం రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వాటర్ లీక్ అవుతున్నాయంటే పనులు చివరి దశకు చేరుకున్నాయనే విషయం గమనించాలన్నారు మంత్రి. లీకేజీ ను అరికట్టేందుకు విశాఖ నుంచి నిపుణులు వచ్చారని.. మరో రెండు రోజుల్లో నీటిని బయటకు తోడేసి.. పనులు ప్రారంభిస్తామన్నారు. త్వరలోనే ప్రాజెక్టు ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారని మంత్రి సురేష్ వెల్లడించారు.