అద్దరగొట్టిన ఎవరు మీలో కోటీశ్వరుడు కర్టన్ రైజర్ షో

ఎవరు మీలో కోటీశ్వరులు కర్టన్ రైజింగ్ ఎపిసోడ్ బుల్లితెర ప్రేక్షకులు అలరించారు. రామ్ చరణ్ గెస్ట్ గా హాజరైన ఈ ప్రోగ్రామ్ లో గేమ్ గురించి కంప్లీట్ రూల్స్ చెప్పారు. అలాగే ఈ ప్రోగ్రామ్ గురించి క్లియర్ గా వివరించారు జూనియర్ ఎన్టీఆర్. షోలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మద్య సాగిన చిట్ చాట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ చరిత్రను రీక్రియేట్ చేస్తున్నామంటూ ఆర్ఆర్ఆర్ సినిమా సంగతులు చెబుతూ షో స్టార్ట్ చేసి రామ్ చరణ్ ను ఆహ్వానించారు.

ఈ గేమ్ లో గెలిచిన అమౌంట్ ను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కోసమని రామ్ చరణ్ అన్నారు.రాజమౌళి దగ్గర్నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు చాలా విషయాలు మాట్లాడుకున్నారు.

రామ్ అండ్ రామ్ గా షో ను నాన్ స్టాప్ ఎంటర్ టైనర్ గా రన్ చేసారు. బుల్లితెరపై ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్. మళ్ళీ ఇన్నాళ్ళకు ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షోతో ఆడియన్స్ ని మంత్ర ముగ్దుల్ని చేశారు. ఈ షో కి సంబంధించిన ప్రమోషనల్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈరోజు ఎపిసోడ్ లో కూడా రామ్ చరణ్ తో కమామీషు కంటిన్యూ అవుతుంది. నెక్ట్స్ నుండి రెగ్యులర్ కంటెస్టెంట్స్ తో షో ను రన్ చేయనున్నారు.