బట్టతల వస్తుందని భయపడుతున్నారా? ఇలా చేయండి..

Fear of getting Bald? Do this

 

ఇప్పుడు ఏం చెప్పాల్సి వచ్చినా కరోనాకు ముందు.. కరోనా తర్వాత అని చెప్పాల్సి వస్తుంది. కరోనా ఆరోగ్యాలనే కాదు.. ఆహారపుటలవాట్లను మార్చేసింది. చాలా మంది సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో బిజీ అయిపోయారు. ఎక్కువ సేపు దానిమీదే గడుపుతూ నిద్రకు దూరం అవుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఓవైపు ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. మరోవైపు తినాల్సినవి పక్కన పెట్టి తినకూడని జంక్ ఫుడ్స్ పొట్టలో పడేస్తున్నారు. అయితే ఈ అలవాట్లు నిద్రమీద, ఆరోగ్యంపైనా పడి డిప్రెషన్ కు దారి తీసి బట్టతలను తీసుకువచ్చేలా మారతాయట.

అధిక ఒత్తిడి వల్ల వెంట్రుకల కుదుళ్లు దెబ్బతింటాయి. అలోపేసియా ఏరియాటా ఏర్పడుతుంది. దీనివల్ల పురుషులకు యుక్త వయస్సులోనే జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. ఏ జబ్బు అయినా, అలవాట్లు అయినా ప్రారంభంలోనే దానిని గమనించి సరిదిద్దుకుంటే పెద్దపెద్ద సమస్యల నుంచి ఈజీగా బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

రోజూ గుడ్డు తింటే..

కోడిగుడ్డులో ప్రోటీన్ అలాగే బయోటిన్ వంటి పోషకాలు ఫుల్ గా ఉంటాయి. ఈ రెండు కూడా జుట్టు పెరుగుదలకు చాలా అవసరం. జుట్టు కుదుళ్లను బాగా బలోపేతం చేయడానికి ప్రోటీన్ అనేది బాగా సహాయపడుతుంది. అయితే బయోటిన్ అనేది పెరిగే జుట్టు కోసం ప్రోటీన్ కెరాటిన్ ఉత్పత్తికి ఎంతగానో సహాయపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలను బాగా పెంచుతుంది. ఈ పోషకాల లోపం సాధారణంగా జుట్టు రాలడానికి బాగా కారణమవుతుంది. రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తప్పనిసరిగా తీసుకోవడం వల్ల బట్టతలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

డైలీ క్యారెట్ తీసుకుంటే..

జుట్టు రాలడాన్ని కూడా క్యారెట్ నివారిస్తుంది. అలాగే క్యారెట్‌లో విటమిన్ ఎ, సి, కె, బి కాంప్లెక్స్ ఇంకా పొటాషియం, ఫాస్పరస్ అలాగే ఫైబర్ వంటి పోషకాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఈ మొత్తం అన్ని కూడా శారీరక ఆరోగ్యానికి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి.

తరచూ ఆకుకూరలు తింటే..

పచ్చని ఆకు కూరలు కూడా శారీరక ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ ఆకుకూరలో జుట్టు సంరక్షణ రహస్యం కూడా ఉంది. ఇక పాలకూర అనేది వివిధ పోషకాలతో కూడిన గొప్ప మూలం. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ బి, సి, ఇ, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇంకా ఐరన్ ఉంటాయి.
వీటిని ఆహారంలో చేర్చుకోవడంతో పాటు తగినంత నిద్ర, వ్యాయామం కూడా డైలీ అలవాటు చేసుకుంటే చిన్నతనంలోనే వచ్చే బట్టతలను దూరం చేసుకోవచ్చు. పైగా జట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది.