సుప్రీం చరిత్రలో తొలిసారి 9 మంది కొత్త జడ్జిల ప్రమాణస్వీకారం..

Supreme Court Judges,
Supreme Court Judges

సుప్రీంకోర్టులో కొత్తగా నియమితులైన న్యాయవాదులు ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టులో ఒకేసారి 9 మంది జడ్జిలు ప్రమాణం చేశారు. కొత్త జడ్జీలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు చరిత్రలో 9 మంది జడ్జిలుగా ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణం చేసిన వారిలో జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ నాగరత్న, జస్టిస్ రవికుమార్, జస్టిస్ సుందరేశ్, జస్టిస్ బెలా త్రివేది, జస్టిస్ శ్రీనరసింహ ఉన్నారు.