
అమెరికాలో క్యాపిటల్ బిల్డింగ్ వద్ద ఇప్పటివకు జరిగిన అల్లర్లలో నలుగురు మృతి చెందినట్టు ఆసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ తెలియచేసింది. అయితే క్యాపిటల్ బిల్డింగ్ వద్ద జరిగిన ఫైరింగ్లో ఓక మహిళ ప్రాణాలు కోల్పోయినారు.. మిగిలిన ముగ్గురు మెడికల్ ఎమర్జెన్సీ కారణాలతో చనిపోయినట్లుగా తెలియచేసినారు. అంతే కాకా బిల్డింగ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన 52 మందిని అధికారులు అరెస్ట్ చేసినట్టు చెప్పినారు.
క్యాపిటల్ బిల్డింగ్ కి జాతీయ భద్రతా అధీనంలో ఉన్న కానీ అక్కడ భారీ సంఖ్యలో ట్రంప్ మద్దతుదారులు నిరసనను చేస్తున్నారు. అయితే అక్కడ పోలీసులు అదుపు లో తీసుకున్నవారిలో చాలా మంది వద్ద లైసెన్సు లేని తుపాకులు గుర్తించారు. మరోవైపు రిపబ్లికన్, డెమోక్రటిక్ నేషనల్ కమిటీ హెడ్క్వార్టర్ల సమీపంలో రెండు పైప్ బాంబులను పోలీసులు గుర్తించినారు, అయితే వాటిని కూడా పోలీస్ లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘర్షణలో14 మంది పోలీసులు కూడా గాయాలుపాలైనారు, ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నందున అరెస్టులు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసినారు పోలీస్ లు. అంతే కాకా హింసకు కారణమైన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. క్యాపిటల్ బిల్డింగ్ దగ్గర తీసిన ఫోటోలు, వీడియోలను చాలా స్పష్టంగా పరిశీలిస్తున్నారు అధికారులు.