దుబాయ్ నుంచి.. గోవా ఫ్లైటెక్కిన మ‌హేష్ బాబు..!

From Dubai Mahesh Babu on a flight to Goa
From Dubai Mahesh Babu on a flight to Goa

సూప‌ర్ స్టార్ కొత్త మూవీ స‌ర్కార్ వారి పాట షూటింగ్ కోసం మ‌హేష్ బాబు లోకేష‌న్ల‌న్నీ చుట్టేస్తున్నాడు. ఈ చిత్రం ఫ‌స్ట్, సెకండ్ షెడ్యూళ్లు దుబాయ్‌లో కంప్లీట్ అయ్యాయి. దీంతో దుబాయ్ నుంచి నేరుగా.. గోవా వెళ్ళాడు మ‌హేష్. గోవాలో ఈ చిత్రాన్నికి సంబంధించి‌ కొన్ని కీల‌క స‌న్నివేశాల‌లు గోవాలో చిత్రీక‌రించనున్న‌ట్టు తెలిసింది. అలాగే ఓ సాంగ్ షూటింగ్ కూడా అక్కడ జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబందించిన కొన్ని వీడియో లను త్వ‌ర‌లో విడుద‌ల చేస్తామ‌ని ఈ చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో మ‌హేష్‌బాబు జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. ప‌రశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకా 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌నీ ల్యాండ‌రింగ్ కథాంశంతో బ్యాంకుల అక్ర‌మాలు, ఈ సినిమా తెర‌కెక్కుతోంది.