జింజర్ టీ మన ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

Ginger tea benefits

 

నిజంగానే అల్లం టీ ఒక అద్భుతం. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అల్లంలో విటమిన్ సి, మెగ్నీషియం, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
అల్లం చర్మం, జుట్టు, శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు అడ్డా అని చెప్పొచ్చు. అల్లం వికారం, వాంతులకు మంచి చిట్కా. మార్నింగ్ సిక్‌నెస్ చికిత్సకు అల్లం చాలా సంవత్సరాలుగా ఉపయోగించబడుతోంది. అల్లం తీసుకోవడం వల్ల లూజ్ మోషన్స్, జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. అల్లం టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

ఒత్తిడికి చెక్..

అల్లం వాసన మన శరీర వ్యవస్థకు చాలా విశ్రాంతినిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయ పడుతుంది. ఇది మన శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి, మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది.

వాపు తగ్గించడానికి..

అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది వాపును తగ్గించడంలో సహాయ పడుతాయి. కండరాలు లేదా కీళ్లలో వాపు లేదా ఏదైనా రకమైన వాపు ఉంటే, అప్పుడు ఒక కప్పు అల్లం టీ తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

శ్వాసకోశ సమస్యలకు..

అల్లం టీలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. అందువల్ల ప్రతిరోజూ
అల్లం టీ తీసుకోవడం వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ రాకుండా, ఉండడంతో పాటు రోగాలతో శరీరం పోరాడటానికి సహాయ పడుతుంది.

రక్త ప్రసరణలో మెరుగుదలకు..

అల్లం టీలో ఉండే విటమిన్లు, మినరల్స్, అమైనో ఆమ్లాలు రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి. ఇది హృదయ సంబంధ సమస్యల అవకాశాలను తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తి బలోపేతానికి..

బలహీనమైన రోగ నిరోధక శక్తి అనేక వ్యాధులకు గురి చేస్తుంది. కానీ అల్లం టీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇలా వ్యాధి నుండి రక్షిస్తుంది.

రుతుక్రమ సమస్యల నుంచి ఉపశమనానికి..

ప్రతి నెలా కడుపు నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతుంటే, ఒక కప్పు అల్లం టీని తీసుకోవచ్చు. ఒక కప్పు అల్లం టీని తేనెతో కలిపి తాగడం వల్ల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. కండరాలు రిలాక్స్ అవుతాయి.

సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టడానికి..

వర్షాకాలం, శీతాకాలం వచ్చిందంటే చాలామంది జలుబు, దగ్గు వంటివాటితో బాధపడతారు. ఇలాంటివారు ఉదయాన్నే అల్లం టీని పాలు లేకుండా షుగర్ కు బదులు తేనె కలిపి తాగితే చాలా ఉపయోగం ఉంటుంది.