గూగుల్ పిక్సెల్ 6 స్మార్ట్‌ఫోన్‌ భారత్​లో విడుదల ఇప్పుడు కాదట!

గూగుల్ నుంచి వచ్చే ఫిక్సల్ స్మార్ట్ ఫోన్లకు మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంటుంది. ప్రీమియం రేంజ్ లో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ లు మార్కెట్లోకి విడుదలవ్వడమే ఆలస్యం హాట్ కేకులా అమ్ముడుఅయిపోతాయి. అందుకే గూగుల్ నుంచి లేటెస్ట్ వెర్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు టెక్ ప్రియులు. అలాంటి వారి కోసం గూగుల్ నిన్న రాత్రి ఫిక్సల్ 6 సిరీస్ ను కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, తైవాన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ , యునైటెడ్ కింగ్‌డమ్ దేశాలలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇండియా, చైనా మరియు ఇతర యూరోపియా దేశాల్లోనూ ఈ ఫిక్సల్ 6 సిరీస్ ను ఇప్పుడు విదులచేయకపోవడంతో ఫిక్సల్ 6 సిరీస్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే ఈ దేశాలల్లో 2022లో విడుదల చేసే అవకాశం ఉంది.

గూగుల్ నుండి గతం లో మార్కెట్ లోకి వచ్చిన స్మార్ట్ ఫోన్ ఫిక్సల్ 4, ఫిక్సల్ 5 కూడా మొదట గూగుల్ ప్రొడక్ట్స్ కు ఎక్కువ బిజినెస్ ఉన్న ప్రాంతాలల్లో విడుదల చేసి తరువాత ఇండియా తో సహా చాలా దేశాల మార్కెట్లో కి లాంచ్ చేసింది. అయితే ఒక టోన్ – డౌన్ ఫిక్సల్ “ఏ” సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ను ఒకేసారి గ్లోబల్ మార్కెట్లో కి తీసుకు వచ్చింది. గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ మొత్తం రెండు మోడళ్లతో మార్కెట్లో కి అందుబాటులోకి రానుంది. ఇది​ పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో పేర్లతో లాంచ్​ అవుతోంది. రాబోయే ఈ పిక్సెల్​ 6 సిరీస్​ సరికొత్త డిజైన్ తో , ఇన్-హౌస్ చిప్‌సెట్​తో రూపొందించినట్లు అనేక గాసిప్స్ ఆన్​లైన్​లో ప్రచారం అవుతున్నాయి. కాగా, గూగుల్​ పిక్సెల్​ 6 సిరీస్​ రానున్న చోట్ల యూజర్లు మాత్రం ఈ స్మార్ట్​ఫోన్లను పొందేందుకు గూగుల్ స్టోర్లలో తమ డీటైల్స్ నమోదు చేసుకోవాలి. అయితే ఈ ఫోన్లు అన్ని రంగుల్లో, అన్ని ప్రాంతాల్లో లభించవని గూగుల్​ తెలిపింది.