ప్రజా పోరాటాలకు ప్రభుత్వాలు తలవంచక తప్పదు: వడ్డే శోభనాద్రీశ్వరరావు

Governments must bow to public struggles: Vadde Shobhanadriswara Rao

 

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఉద్యమం చేస్తున్న రైతులను, రైతుసంఘాల మద్య చీలకులు తెచ్చి ఉద్యమాన్ని బలహీనం చేయాలని బిజెపి కేంద్ర ప్రభుత్వం కుట్రల పన్నడం దుర్మార్గమని రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు.లంఖిపూర్ ఖేరిలో శాంతియుతంగా అందోన చేస్తున్న రైతులను వాహనాలతో తొక్కించి, తుపాకీతో కాల్చి చంపటం ఘోరం అన్నారు.

సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈరోజు విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతుసంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.ఈ ధర్నాకు హజరైన సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బి. వి రాఘవులు మాట్లాడుతూ ఒక వైపు రైతుల హక్కులను హరిస్తు మోడీ మానవ హక్కుల గురించి మాట్లాడడం సిగ్గు చేటు అన్నారు.

కేంద్ర ప్రభుత్వంలో నేరస్తులకు మంత్రి పదవులు ఇచ్చారని ఎందుకంటే ప్రజా ఉద్యమాన్ని ఎలా అణిచివేయాలో నేరస్తులకు బాగా తెలుసు కాబట్టి నేరస్తుల క్యాబినెట్ గా మార్చారని అన్నారు.గత10 నేలల నుండి ఉద్యమం చేస్తుంటే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహారించటం తగదని, ప్రజ ఉద్యమానికి ప్రభుత్వాలు తలవంచక తప్పదని చరిత్ర అనుభవం చెబుతోందన్నారు.రైతులు చేస్తున్న ఉద్యమం రైతుల ఒక్కరికే సంబంధించినదికాదని ప్రజలందరికీ సంబంధించిన అశంమన్నారు.ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బిజెపిని ఒడించినా బుద్ది రాలేదన్నారు.సమీప భవిష్యత్తులో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో రైతుఉద్యమం బిజెపిని ఒడిస్తుందన్నారు.

రైతుసంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వడ్డేశోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ లంఖిపూర్ రైతులను చంపిన బిజెపి గుండాలను తక్షణమే అరెస్ట్ చేయాలని అన్నారు.దీనికి బాద్యులైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.కిసాన్ సభజాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య మాట్లాడుతూ విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును,నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించు కోవాలని కోరారు.ఈ ధర్నాకు ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య సమన్వయ కర్తగా వ్యవహరించారు.

ఈ ధర్నా కార్యక్రమంలో ఐద్వా జాతీయ ఉపాధ్యక్షులు యస్. పుణ్యవతి,ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శిలు వై.కేశవరావు,మర్రాపు సూర్యానారయణ,సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆర్. రవిందనాథ్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ,రైతుకూలీ సంఘం రాష్ట్ర సహయ కార్యదర్శి యం.బ్రహ్మయ్య,కిసాన్ మహసభ రాష్ట్ర అధ్యక్షులు డి.హరనాథ్, రైతుకూలీ సంఘం రాష్ట్ర అద్యక్షులు యం.వెంకటరెడ్డిఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి ప్రసాద్,చెరకు రైతులసంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండపనేని ఉమావరప్రసాద్, బికెయు రాష్ట్ర నాయకులు సురేష్, సుబాబుల రైతుసంఘం రాష్ట్ర నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, పి డి యస్ యు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎ .వి.నాగేశ్వరరావు, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్ .అనిల్ కుమార్ ,కృష్ణా జిల్లా రైతుసంఘాల నాయకులు పి.వి ఆంజనేయులు, యం.యల్లామందారావు, సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి యన్ సిహెచ్ శ్రీనివాస్ ,జిల్లా నాయకులు సుప్రజ,కమల,ఎఐటియుసి జిల్లా నాయకులు తాతయ్య తదితరులు పాల్గొన్నారు. సి.ఐ.టి.యు పశ్చిమ జిల్లా కార్యదర్శి ఎ వెంకటేశ్వరావు ధర్నాకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు.