కీరాదోస తింటే ఎన్ని ఉపయోగాలో..

Health Benefits of Cucumber

 

కీరా తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందన్ని విషయం అందరికీ తెలుసు. అయితే దీనిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరానికి చల్లదనంతో పాటు చర్మసంరక్షణను అందించేందుకు కీరాదోస చాలా మేలు చేస్తుంది. ఎండ ప్రభావం వలన చర్మం కందిపోతుంది. అలాంటప్పుడు కీరాదోస ముక్కలతో చర్మం మీద రుద్దుకుంటే రిలీఫ్ వస్తుంది. అలానే టాన్ సమస్య నుండి చర్మాన్ని రక్షిస్తుంది. కీరాదోస ముక్కలు ఉంచిన నీళ్లను రోజూ తాగుతుంటే శరీర పీహెచ్ ఒకేవిధంగా ఉంటుంది.

కీరా ముక్కలను కళ్లపై ఉంచుకుంటే కంటి అలసట పోతుంది. కీరాను సలాడ్స్ రూపంలో తీసుకోవడం వలన శరీరానికి కావలసిన పీచు పదార్థం అందుతుంది. ఎందుకంటే.. ఈ పీచు పదార్థం జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

కీరాను తినడం వల్ల తొందరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునే వారికి కీరా చాలా మంచిది. కీరాదోస రసం తాగితే చిగుళ్ల గాయాలు తగ్గిపోతాయి. దంతాలు ఆరోగ్యాంగా ఉంటాయి.

ముఖ్యంగా కీరా నోటి దుర్వాసను తగ్గిస్తాయి. కీరాలోని విటమిన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి. కీరాలోని క్యాల్షియం డయాబెటిస్, కీళ్ల నొప్పులు, ఎముకల బలానికి ఎంతో దోహదపడుతాయి. కొందరైతే తిన్న ఆహారాలు జీర్ణంకాక సతమతమవుతుంటారు. అలాంటి వారు కీరాదోస తొక్కలను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై వాటిలో కొద్దిగా ఉప్పు, కారం కలిపి తింటే అజీర్తికి చెక్ పెట్టవచ్చు. దాంతోపాటు శరీరానికి కావలసిన ఎనర్జీని కూడా అందిస్తాయి కీరా. అందుకే రోజూ కీరా దోసని తింటే 80 రకాల మంచి పోషక విలువలు సొంతం చేసుకున్నట్లేనని న్యూట్రీషియనిస్ట్ లు చెబుతున్నారు.