కళ్లను ఇలా కాపాడుకుందామా..

how to protect your eyes

సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అయితే ప్రస్తుతం మారుతున్న కాలంతో కళ్ల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఓల్డేజ్ లో రావాల్సిన కంటిసమస్యలు స్కూల్ ఏజ్ లోనే వస్తున్నాయి. స్మార్ట్ ప్రపంచంలో లేట్ నైట్ వరకూ టీవీలు, ల్యాప్ టాప్ లు, ఫోన్లు చూడటం వల్ల కంటి చూపు తగ్గుతుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఆకుకూరలు తింటే ఆరోగ్యం

ఆకుకూరలు తింటే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. జుట్టుసమస్యలు కూడా ఉండవు. అందులోనూ పాలకూర వంటి ఆకుకూరల్లో ఫైబర్, విటమిన్ సీతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని సంరక్షించడలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే కంటి చూపు మెరుగుపడాలంటే ఆకుకూరలు తినాలని వైద్యులు పదే పదే చెబుతుంటారు

చేపలు ఎక్కువగా తింటే

చేపలు ఎక్కువగా తింటే కంటి చూపు మెరుగవుతుందని మన పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి కంటి సమస్యలను నివారించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ట్యూనా, సాల్మన్ వంటి చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. కానీ చాలామందికి చేపలు తినటం అంటే ఇష్టం ఉండదు. కానీ కనీసం నెలకు ఒకసారైనా చేపలు తినటం మంచిది.

గుడ్లు రోగనిరోధక శక్తిని పెంచటంలో

గుడ్లు రోగనిరోధక శక్తిని పెంచటంలో చాలా ఉపయోగపడతాయు. గుడ్లలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు , ప్రొటీన్‌ ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఏ, జింక్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. కాబట్టి డైలీ ఉడకపెట్టిన గుడ్డును తింటే చాలా మంచిది.

బాదంలో

బాదంలో విటమిన్లు, ఖనిజాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి కంటికి ఎంతో మేలు చేస్తాయి. బాదంతో పాటు వాల్‌నట్స్, చియా గింజలు, నువ్వు గింజలు, వేరుశెనగలను తింటే కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. జుట్టు సమస్యలు, బరువు తగ్గటం వంటివి డైలీబాదం తినటం వల్ల తగ్గించుకోవచ్చు. అంతేకాదు బాదం తింటే ఏజ్ లుక్ కూడా కనిపించదట. స్కిన్ మృదువుగా అవుతుందంటారు.

పప్పుల్లో ప్రోటీన్‌లు

పప్పుల్లో ప్రోటీన్‌లు బాగా ఉంటాయి. కిడ్నీ బీన్స్, బఠానీల్లో బయోఫ్లేవనాయిడ్స్, జింక్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే కంటి చూపు పెరుగుతుంది. ఇతర కంటి సమస్యలు కూడా తగ్గుతాయట.
విటమిన్ సి..మనకు చాలా అవసరమైన విటమిన్.. నారింజ, బెర్రీలు, ద్రాక్షపండ్లు, నిమ్మకాయల్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు కంటి ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకే ఈ పళ్లు తింటే కంటి చూపు పెరుగుతుంది. దాంతోపాటు రోగనిరోధక శక్తికూడా మెరుగుడుతుంది.

విటమిన్ ఏ కంటి చూపునకు ఎంతో మంచిది. క్యారెట్లలో విటమిన్-ఏ, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే క్యారెట్లు బాగా తింటే కళ్లు బాగా కనిపిస్తాయి. క్యారెట్లు తింటే ఫేస్ లో కూడా మంచి గ్లో కూడా వస్తుంది.

ఇక చాలామంది పాలు, పెరుగు ఇష్టపడరు. ఆ వాసన కూడా పడకపోవడంతో దూరం పెడుతుంటారు. కానీ పాలు, పెరుగులో విటమిన్ ఏ, జింక్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. విటమిన్ ఏ కార్నియాను రక్షించడంలో దోహదపడుతుంది. జింక్ కారణంగా కంటిశుక్లాలు తగ్గుతాయి.