రోజూ ఒక ఆపిల్ కాకపోయినా.. బనానా అయినా తినండి..

If not an apple every day eat a banana

 

ఈ రోజుల్లో ఎక్కడ చూసినా.. గుండెపోటుతో బాధపడుతున్నవారు, దానితోనే చనిపోయిన వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనికి మన జీవనశైలి కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే రోజూ ఆపిల్ కాకపోయినా ఒక అరటిపండు తినడం ద్వారా దీనికి చెక్ పెట్టొచ్చని అంటున్నారు.

అరటి పండు తక్కువ ఖరీదుతో దొరికే హెల్దీ ఫ్రూట్. ఇది ఇతర పండ్ల కంటే ఎక్కువ పోషకాలున్నవి మాత్రమే కాదు. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల పరిశోధన ప్రకారం.. అరటిపండు లేదా యాపిల్ రోజూ గుండెపోటుతో మరణించే ప్రమాదాన్ని మూడోవంతు తగ్గిస్తుంది.

ప్రతిరోజూ ఒక అరటిపండు..

పీరియడ్స్, గర్భం మొదలైన వాటివల్ల మహిళలకు శరీరంలో ఐరన్, కాల్షియం వంటి పోషకాల లోపం ఉంటుంది. వీరికి అరటి పండు మంచి ఆహారం అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో, శరీరం బలహీనత కారణంగా, అనేక రకాల సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి మహిళలు ప్రతిరోజూ ఒక అరటిపండు తినాలి. అరటిపండ్లలో విటమిన్లు, ఐరన్, ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైనవి ఉంటాయి. ప్రతిరోజూ మీడియం సైజు అరటిపండు తీసుకోవడం ద్వారా, శరీరానికి 9% పొటాషియం లభిస్తుంది.

అరటిపండుతో ప్రయోజనాలు..

అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన దీనిని డైలీ తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే హృదయనాళ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

అరటి తొక్క మీద నల్లటి మచ్చలు కనిపించడం వల్ల, చాలా సార్లు మనం దానిని కుళ్లిపోయిందని పడేస్తాము. కానీ ఎక్కువ పండిన అరటిపండ్లను తినడం వల్ల క్యాన్సర్‌ను నివారించవచ్చు.
అరటితో రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. దీని వలన రోజంతా రిఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ సరిగ్గా ఉంటుంది. శరీరంలో ఐరన్ లోపం క్రమంగా తగ్గుతుంది.
ఆస్తమా వ్యాధి నుంచి రక్షించడానికి అరటి ఉపయోగపడుతుంది.

పెరుగుతున్న బీపీ, షుగర్ వల్ల గుండె సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, గుండె సంబంధిత ఇబ్బందులు ఉన్న రోగులు ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ అరటిపండు తినడంతో పాటు.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి డైలీ లైఫ్ లో యాడ్ చేసుకుంటే హెల్దీగా ఉండొచ్చు.