మీరు బ్రేక్ ఫాస్ట్ కు ప్రియారిటీ ఇస్తున్నారా? లేదా?

Importance of Eating Breakfast

 

ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. అవును చూడటానికి చిన్నగా అనిపిస్తున్నా అనుభవించిన వారికే అది తెలుస్తుంది. ఎందుకు బరువు పెరుగుతున్నామో తెలియక.. వెయిట్ ఎలా తగ్గించుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. వేళకు తినకపోవడం, సమయానికి నిద్ర పోకపోవడం, తమకు తెలీకుండానే ఎక్కువ తినేయడం వంటి కారణాలతో ఈజీగా బరువు పెరిగిపోతుంటారు. అయితే ఇవే కాకుండా మరికొన్ని రీజన్స్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అయిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు.

అధిక బరువును తగ్గించుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ, కొంతమందికి ఆ సమయం కూడా ఉండదు. బరువు తగ్గడానికి కడుపు కాల్చుకుంటారు. ఆహారం ఎక్కువగా తీసుకోరు. అయినా కూడా అలాంటి వారు బరువు తగ్గకపోగా ఇంకాస్త పెరుగుతారు. బరువు తగ్గాలని మితి మీరి వర్కవుట్లు చేస్తే అనారోగ్యాల బారిన పడతారు. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ కూడా మనం బరువు పెరగడానికి కారణమవుతుందట.

బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల క్యాలరీలు తగ్గి బరువు తగ్గుతామని చాలామంది అనుకుంటారు. నిజానికి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తిననివారు.. బ్రేక్ ఫాస్ట్ తీసుకునేవారి కంటే వేగంగా బరువు పెరుగుతారట. ఎందుకంటే ఇలా బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల శరీర మెటబాలిజం నెమ్మదిస్తుంది. అంతేకాదు.. ఆకలి ఎక్కువగా వేయడం వల్ల.. మధ్యాహ్నం సమయంలో భోజనం ఎక్కువగా తినేస్తారు. ఇది కూడా బరువు పెరగడానికి కారణమే అవుతుందట. అందుకే బరువు తగ్గాలనుకునే వారు.. తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయాల్సి ఉంటుంది.

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల.. టైప్ 2 డయాబెటిస్ వచ్చే రిస్క్ 54 శాతం పెరుగుతుందట. హార్వర్డ్ యూనివర్సిటీ ఓ పరిశోధన నిర్వహించింది. ఇందులో భాగంగా బ్రేక్ ఫాస్ట్ తినే అలవాటు లేని వారిలో.. డయాబెటిస్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని తేలింది. అందుకే బ్రేక్ ఫాస్ట్ లో హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యంతో పాటు బరువు కూడా తగ్గొచ్చు.