
చెన్నై, చెపాక్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో మెుదటి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. యువ ఓపెనర్ శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ డకౌట్ కావడం, ఛటేశ్వర్ పుజారా 21 పరుగులకే ఔట్ అవ్వడంతో భారత్‌కు అదిలోనే ఎదురుదెబ్బ తగిలింది 106 పరుగులకే భారత్ 3 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓ పక్క వికెట్లు పడుతున్నా ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ ఇంగ్లాండ్ బౌలర్లపై కౌంటర్ అటాక్ మొదలుపెట్టాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ కేవలం 130 బంతుల్లోనే సెంచరీనీ పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ. ఈ సెంచరీతో రోహిత్ శర్మ తన టెస్టు కెరీర్లో 7వ సెంచరీనీ పూర్తి చేసుకున్నాడు. వైస్ కెప్టెన్ రహానేతో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రోహిత్.