భారత్ – ఇంగ్లాండ్ మధ్య ఆఖరి పోరు !!

India Vs England Final test Match

 

వరల్డ్ టెస్ట్ ఛాంపియంషిప్ లో ఓటమి తర్వాత ఇంగ్లాండ్ లో భారత్ ఆట పై అంచనాలు తక్కువగానే ఉన్నాయనే చెప్పాలి.ఆగష్టు 4న మొదలయిన మొదటి టెస్ట్ లో భారత్ బాగా ఆడినా ఐదవ రోజు వర్షం కారణం గా మ్యాచ్ డ్రా ముగిసింది.

ఆగష్టు 12న 2వ టెస్ట్ ప్రారంభం అయ్యింది మొదటిరోజు టాస్ ఓడిపోయి బాటింగ్ దిగిన భారత్ రోహిత్ – రాహుల్ ఓపెనింగ్ కాంబినేషన్ లో తొలి శతక భాగస్వామ్యన్ని నెలకొల్పి మంచి స్టార్ట్ ఇవ్వడం తో ఇండియా 364 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. రాహుల్ 129 పరుగులతో సెంచరీ తో ఆకట్టుకున్నాడు.ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 391 పరుగులకి అల్ అవుట్ అయ్యింది. కెప్టెన్ రూట్ 180పరుగులతో అజెయంగా నిలిచాడు.

నాల్గవ రోజు ఇండియా 2వ ఇన్నింగ్స్ లో ఒకానోక దిశలో తక్కువ స్కోర్ కే అల్ అవుట్ అవుతుందనే అనుకున్నారంతా కానీ టేయిలెండర్స్ అయిన బుమ్రా అండ్ షమి కలిసి 80 రన్ పార్ట్నషిప్ చేసారు. ఇండియా 298-8 డిక్లేర్ చేయగా ఐదవ రోజు ముగియడానికి ఇంకా 60 ఓవర్లు మాత్రమే మిగిలి ఉండగా ఇంగ్లాండ్ గెలవాలంటే టార్గెట్ 267 కొట్టాల్సివుంది, అందరు ఈ మ్యాచ్ డ్రా అవుతుందని భావించారు కానీ మన హైదరాబాద్ కుర్రాడు సిరాజ్ ఒక డ్యూరోసెల్ బ్యాటరీ తరహాలో అలుపెరగని ఎనర్జీ తో బౌలింగ్ చేసి అత్యదిక వికెట్స్ తో అజేయంగా నిలిచాడు. సిరాజ్ తో పాటు బుమ్రా, షమి, ఇషాంత్ లు కలిసి ఇంగ్లాండ్ ను 120 పరుగులకే అల్ అవుట్ చేసి1986, 2014 తరువాత మొరోమారు లార్డ్స్ లో 2021 ఆగష్టు 16న భారత్ కు మరువలేని విజయాన్ని అందించారు.

3వ టెస్ట్ ఇండియా ఇన్నింగ్స్ లాస్ అవ్వడం తో సీరీస్ ఇండియా 1 – ఇంగ్లాండ్ 1 తో సమానమయ్యింది.
నాల్గవ టెస్ట్ లండన్ లోని కెన్నిగంటన్ ఓవల్ లో మ్యాచ్… ఈ సారి మళ్ళీ ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోగా 127 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భారత్ కు షార్దుల్ 36 బంతుల్లో 57 పరుగులు చేయగ ఇండియా 191 పరుగులకు అల్అవుట్ అయ్యింది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 290 పరుగులు చేసి 99 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.

రెండవ ఇన్నింగ్స్లో ఇండియన్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ – రాహుల్ రెండవ టెస్ట్ లాగానే మళ్ళీ మంచి ఓపెనింగ్ పార్టనర్షిప్ నెలకొల్పగ ఇండియన్ లోయర్ఆర్డర్ లో షార్దుల్ మరో అద్భుత అర్దశతకం చేసి తను నిజంగానే ‘లార్డ్ షార్దుల్’ అని నిరూపించుకున్నాడు. ఇండియా 466 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యి ఇంగ్లాండ్ కి 368 పరుగుల టార్గెట్ ఇచ్చారు.

ఆఖరి రోజు డ్రా దిశగా వెళ్తున్న మ్యాచ్ను బూమ్ బూమ్ బుమ్రా తన మ్యాజికల్ బౌలింగ్ తో అతుతమ ప్రసాదర్శన కనబరిచాడు అంతేగాక 24టెస్టులలోనే 100 వికెట్లు తీసిన ఫాస్టెస్ట్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జడేజా ఫాస్ట్ బోలర్స్ ఉమేష్, షార్దుల్ కూడా మంచి ప్రదర్శన కనబరిచగా ఇండియా ఇంగ్లాండ్ పై 157పరుగుల విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రోహిత్ ఇంగ్లాండ్ లో తన మొదటి శతకం తో మాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

ఈ గెలుపుతో భరత్ 5 మ్యాచ్ల సీరీస్ లలో (భారత్ 2 – ఇంగ్లాండ్ 1) ఆదిక్యం లోకి వెళ్ళింది. రేపు జరగబోయే ఆఖరి మ్యాచ్ లో ఇండియా డ్రా చేసినా సెరీస్ కైవసం చేసుకోగలుగుతుంది. ఆలా జరిగితే ఇంగ్లాండ్ గడ్డ పై భారత్ 1971 తర్వాత ఇంగ్లాండ్ గడ్డ పై మరోమారు సిరీస్ విజయాన్ని సొంతం చేసుకోగలుగుతుంది.

సో అల్ ది బెస్ట్ టీం ఇండియా!!!