భారత రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా 31 ఆదివారం గవర్నర్ పేటలోని రామ్మోహన్ గ్రంథాలయం సందర్శించనున్నారు.ఈ నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జె. నివాస్ పరిశీలించారు గురువారం మహాత్మా గాంధీ రోడ్డు గవర్నర్ పేట లోని రామ్మోహన్ గ్రంథాలయాన్ని కలెక్టర్ సందర్శించి గౌరవ ఉపరాష్ట్రపతి పర్యటనపై గ్రంథాలయ కమిటీ సభ్యులతో సమీక్షించారు. గ్రంథాలయం లో ఉన్న పలు పుస్తకాలను కలెక్టర్ ఆసక్తిగా పరిశీలించారు, రామ్మోహన్ గ్రంథాలయంలో భారతమాత విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించనున్నారు.ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)యల్ శివ శంకర్, గ్రంథాలయం ప్రెసిడెంట్ సిహెచ్ కోటేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ పీ రామచంద్ర రావుతదితరులు పాల్గొన్నారు .