ఐఫోన్ 13 లాంచ్ డేట్ ఫిక్స్ !!!

 iPhone 13 release date fix

 

ఐఫోన్ 13తో పాటు ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్‌లను యాపిల్ సంస్థ సెప్టెంబర్ 14న విడుదల చేయనుంది. అయితే ఇండియన్ మార్కెట్‌లో ఐఫోన్ 13 ఫోన్లను అక్టోబర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముంది. అంతర్జాతీయంగా దీన్ని విడుదల చేసిన తర్వాత ధరను యాపిల్ సంస్థ ప్రకటించవచ్చని ప్రచారం జరిగింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఐఫోన్ 13 ధర 799 డాలర్లు(రూ.58,600)గా ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. స్థానిక పన్నులను కలుపుకుని భారత్‌లో దీని ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.

ఈ కొత్త మోడల్ అద్భుతమైన లో లైట్ ఫోటోగ్రఫీ మరియు కొత్తగా ఆస్ట్రో ఫోటోగ్రఫీ వంటి ఫీచర్ ను ఆపిల్ అందుబాటులో తీసుకురానుంది. బాటరీ సామర్థ్యం కూడా ఐఫోన్ 13లో ముందు మోడల్స్ కంటే ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తుంది ఆపిల్. ఐఫోన్ 13 సిరీస్‌లో ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌లో అత్యధిక ఫీచర్స్ ఉండనున్నాయి. ఇందులో 6.7-అంగుళాల OLED 120Hz డిస్‌ప్లే ఉంటుంది. ఐఫోన్ 13లో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంటుంది.

అలాగే ఐఫోన్ 13 సిరీస్‌లోని అన్ని మోడల్స్ 5జీని సపోర్ట్ చేస్తాయి. అలాగే వీటి అన్నిటిలోనూ 25W ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది.