టీ, కాఫీ తాగాక నీళ్లు తాగితే నిజంగానే పళ్లు ఊడిపోతాయా?

is it safe to drink water right after drinking coffee and tea

 

చాలమంది టీ లేదా కాఫీ తాగేముందు వాటర్ తాగుతారు.. కానీ వాటిని తీసుకున్నాక మాత్రం నీళ్లు తాగరు. ఒకవేళ మనం తాగుదామని ట్రై చేసినా.. చిన్నప్పటినుంచే మన పెద్దవాళ్లు అలా చేయకూడదు పళ్లు ఊడిపోతాయ్ అంటారు. కాబట్టి అది ఫాలో అయిపోతాం. అయితే ఇది ఎంతవరకూ నిజమో ఇప్పుడు తెలుసుకుందాం.

నిజానికి మనం టీ, కాఫీ వేడి వేడిగా తాగుతాం. ఆ తరువాత వెంటనే చల్లగా ఉండే నీళ్లు తాగడం వలన దంతాలు కదిలి.. ఊడిపోతాయని చెబుతుంటారు. అయితే.. నిపుణులు మాత్రం దీనిపై మీకు ఎలాంటి అపోహలు అవసరం లేదని చెబుతున్నారు. టీ లేదా కాఫీ తాగక ముందు.. తాగాక కొద్దీ సేపటికి మీరు నీరు తాగడం.. లేదా నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించడం చేయాలని అంటున్నారు. ఇలా చేయడం వలన పళ్లు గారపట్టవట. టీ, కాఫీలలో కెఫీన్ అనే పదార్ధం ఉంటుందనే విషయం మనకు తెలసిందే. కెఫిన్ వల్ల పళ్లకు గార పడుతుంది.

ఈ కెఫీన్ అనే పదార్ధం అల్జీమర్స్, గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. ఈ పదార్ధం వల్లనే, మనం టీ, లేదా కాఫీ తాగగానే రిలీఫ్ అయిన ఫీలింగ్ వస్తుంది. కానీ, ఎక్కువ మొత్తంలో టీ ,కాఫీ లు తీసుకోవడం వలన, మన శరీరంలో కెఫీన్ ఎక్కువై కాలేయ సంబంధిత సమస్యలను తీసుకొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే టీ, కాఫీలను పరిమితంగానే తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అలాగే, వేడి వేడిగా టీ, కాఫీ లు తాగడం వలన ఏరో డైజస్టివ్ సిస్టమ్‌ పై ఉండే పొర దెబ్బతింటుంది. అందుకే ముందుగా కొంత మంచినీటిని తాగడం వలన ఈ పొర వేడిని తట్టుకోగలుగుతుందట.

అంతేకాదు టీ, కాఫీలు అసిడిటీని కలిగిస్తాయి. కాలేయ సంబంధిత వ్యాధులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే మీరు కాఫీ లేదా టీ తాగేముందు మంచినీటిని తాగితే.. ఈ సమస్యలు ఉండవు. అలాగే తాగిన తర్వాత కూడా నోట్లో నీళ్లు పోసి పుక్కిలించుకోవటం వల్ల పళ్లు కూడా గారపట్టకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.