విజయ్ సేతుపతి, విక్రమ్ కాంబినేషన్ లో కమల్ హాసన్ భారీ ప్రాజెక్ట్

Kamal Haasan multi starrer with Vijay Sethupathi and Vikram

 

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమల్ హాసన్ సినిమాల్ని ఎంతో డెడికేషన్ తో ఉంటారు. సినీ ఇండస్ట్రీలో ఎవరూ చేయని ప్రయోగాలు చేశారు. అలాగే క్రేజీ నిర్ణయాలు తీసుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ హీరోలకు స్పూర్తిగా నిలిచారు. ఈ పాత్ర చేయలేదని అనిపించుకోకుండా ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించారు. కేవలం యాక్టర్ గానే కాదు, సింగర్ గా, స్క్రిప్ట్, కథ విషయంలో అనుభవం ఉంది.

స్టార్ డైరెక్టర్లు కూడా ఆయన టాలెంట్ కి ఫిదా అవుతుంటారు. దర్శకులు ఏం చెబితే కమల్ హాసన్ అదే చేస్తారు. నిర్మాతగా కూడా ఆయన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఎన్నో సినిమాల్ని తెరకెక్కించారు. ఇప్పుడు విక్రమ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ వహిస్తున్నారు. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజల్, నరేష్ ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు.

లేటెస్ట్ గా కమల్ హాసన్ మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను కమల్ హ్యాండిల్ చేస్తున్నారు. ఇక విక్రమ్, సేతుపతిల క్రేజ్ తగిన విధంగా వారి పాత్రల్ని పవర్ ఫుల్ గా డిజైన్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి ప్రస్తుతం 10 ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. వాటిలో విక్రమ్ సినిమా కూడా ఒకటి. పొన్నియిన్ సెల్వన్, మహావీర్ కర్ణ లాంటి సినిమాలు కూడా ఉన్నాయి.