టీఆర్‌ఎస్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కుమార్తె సురభి వాణీదేవిని

KCR names P V Narasimha Raos daughter Vani Devi as MLC candidate
KCR names P V Narasimha Raos daughter Vani Devi as MLC candidate

హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురభి వాణీదేవిని పేరును టీఆర్‌ఎస్ ‌ఖరారు చేసింది. ఈ మేరకు ఆమె ఈ నెల 22 వ తేదీన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. వాణీదేవి.. దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింగారావుగారి కుమార్తె.

సురభి వాణీదేవి 1952 ఏప్రిల్‌ 1న ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగరలో జన్మించారు. వాణీదేవి ఉస్మానియా యూనివర్సిటీ నుండి బీఏ పూర్తి చేసారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ‌నామినేష‌న్ల‌కు ఫిబ్రవరి 23 చివరి తేదీ. కాగా నామినేషన్ లు ఉప‌సంహ‌ర‌ణ‌కు ఈ నెల 26వ తేదీ వ‌ర‌కు గడువు ఇచ్చారు.