వైష్ణవ్ తేజ్ – కింగ్ నాగార్జున సినిమా..?

King Nagarjuna movie with Uppena hero
King Nagarjuna movie with Uppena hero

వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమా ఉప్పెనతో ఘన విజయం అందుకొన్నాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు భారీ స్థాయిలో కలెక్షన్స్ కూడా రాబడుతోంది. మరోవైపు వైష్ణవ్ తేజ్ క్రిష్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు కింగ్ నాగార్జున సైతం అన్నపూర్ణ బ్యానర్ పై వైష్ణవ్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఈ చిత్రం కొత్త డైరెక్టరుతో ఉంటుందని తెలుస్తోంది. అలాగే జూలై నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందట. అయితే త్వరలో ఈ మూవీకి సంబంధించి ఒక అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.