కోనసీమ తిరుమలకు పోటెత్తిన భక్తులు

Konaseema Tirumala Vadapalli
Konaseema Tirumala Vadapalli

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కోనసీమ తిరుమల గా ప్రఖ్యాతిగాంచింది. ఏడు శనివారాలు స్వామి వారి ఆలయానికి వచ్చి, ప్రతి శనివారం ఏడు ప్రదక్షిణలు చేసి, స్వామివారి దర్శనం చేసుకుంటే ఏడు వారాల తర్వాత కోరిన కోరికలు కచ్చితంగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. దీంతో శనివారం వచ్చింది అంటే చాలు భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. వాయిస్: వాడపల్లి వెంకన్న దర్శనానికి ఈ శనివారం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సుమారు 70 వేల మంది భక్తులు వచ్చినట్లుగా దేవాలయ అధికారులు అంచనా వేశారు. కొందరు ఏడు ప్రదక్షిణలు చేస్తే, మరికొందరు మోకాళ్లపై నడిచారు. ఇంకొందరు పొర్లుదండాలు పెట్టారు. వాస్తవానికి కోనసీమలో కరోనా అధికంగా ఉంది. అయినప్పటికీ లెక్కచేయకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు.కాగా అక్టోబరు 25వ తేదీ నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ముదునూరి సతీష్ రాజు తెలిపారు.