వైష్ణవ్‌తేజ్ ఉప్పెన సినిమా 21 ఏళ్ల క్రితం నమోదు అయిన రికార్డ్ ను బద్దలుకొట్టింది

Uppena movie broke record set 21 years ago
Uppena movie broke record set 21 years ago

వైష్ణవ్‌తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉప్పెన సినిమా ఫిబ్రవరి 12న రిలీజ్ అయ్యి బ్లాక్ బ్లాక్బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా డెబ్యూ హీరోల పరంగా ఆల్ టైం రికార్డ్ ను హీరో వైష్ణవ్ తేజ్ నమోదు చేసుకున్నాడు. అయితే తాజాగా ఉప్పెన సినిమా మరో రికార్డ్‌ను సొంతం చేసుకుంది అది ఏమిటి అంటే డెబ్యూ హీరోల పరంగా ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా గా సంచలనం సృష్టిస్తుంది.

హిందీ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా దాదాపు 21 ఏళ్ల క్రితం పరిచయమైన కహో నా ప్యార్ హే సినిమా అప్పట్లో 41 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్‌ని రాబట్టింది. అయితే ఇపుడు ఉప్పెన సినిమా 21 ఏళ్ల క్రితం నమోదు అయిన రికార్డ్ ను బద్దలుకొట్టింది. 5 రోజుల్లోనే ఉప్పెన సినిమా 42 కోట్ల నెట్ కలెక్షన్స్‌ని, 31 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేయగా.. ఇపుడు ఇది ఇండియాలో సరికొత్త రికార్డ్‌ను నమోదు చేసింది.