గర్భిణీలు కుంకుమపువ్వు పాలు తాగితే ఏం జరుగుతుంది.?

kumkuma puvvu uses in pregnancy in telugu,

 

కుంకుమపువ్వు వంట‌ల‌కు చ‌క్కని రుచి, వాస‌న ఇస్తుంది. కుంకుమ పువ్వులో చాలా ఔష‌ధ విలువలు ఉన్నాయి. అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుతుంది. పుత్తడితో తులతూగే కుంకుమపువ్వులో నిజంగానే బంగారంలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి. కుంకుమ పువ్వును తరచూ తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతుంటారు. అయితే ముఖ్యంగా గర్భిణీలు కుంకుమపువ్వు పాలు తాగితే ఎన్నో ఉపయోగాలున్నాయంటున్నారు.

కుంకుమ పువ్వును అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. ఇది అద్భుతమైన వాసన, రుచిని కలిగి ఉంటుంది. అందువల్ల నాన్ వెజ్ వంటల్లో దీన్ని ఎక్కువగా వేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం కుంకుమ పువ్వులో ఎన్నో అద్భుతమైన ఔషధ విలువలు ఉంటాయి. అవన్నీ మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. కుంకుమ పువ్వును పాలలో కలిపి గర్భిణీలు తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. బిడ్డకు అనేక పోషకాలు అందుతాయి. దీంతో బిడ్డ ఆరోగ్యంగా పుట్టేందుకు అవకాశం ఉంటుంది. పుట్టుకతో లోపాలు రాకుండా ఉంటాయి. అందువల్ల డాక్టర్లు సైతం ఈ విధంగా తాగమని సిఫారసు చేస్తుంటారు.

పాలలో కుంకుమ పువ్వు కలిపి తాగడం వల్ల గర్భిణీలలో హైబీపీ రాకుండా చూసుకోవచ్చు. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఉదయం వికారం, వాంతులు రాకుండా ఉంటాయి. మూడ్ మారకుండా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. ఈ ప్రయోజనాల కోసం గర్భిణీలు కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగితే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.

పాలలో కుంకుమ పువ్వు కలిపి తాగితే బిడ్డ అందంగా,తెల్లగా పుడుతుందని నమ్ముతారు. కానీ శాస్త్రీయంగా దీన్ని ఎవరూ నిరూపించలేదు. అయితే పాలలో కుంకుమ పువ్వును కలిపి తాగడం వల్ల బిడ్డకు, తల్లికి ఆరోగ్యపరంగా చాలా మేలు జరుగుతుందని మాత్రం నిపుణులు చెబుతున్నారు.

కుంకుమ పువ్వును గర్భిణీలు ఎన్నో నెల నుంచి పాలలో కలిపి తాగాలో చాలా మందికి తెలియదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే కుంకుమపువ్వు పాలు తాగుతారు. కానీ ఆయుర్వేద ప్రకారం 4 నెలలు పూర్తయ్యాక 5వ నెల వచ్చాక మాత్రమే పాలలో కుంకుమ పువ్వును కలిపి తాగాలి. 5వ నెలలో బిడ్డ కదలికలు తల్లికి బాగా తెలుస్తుంటాయి. ఆ సమయంలో కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగితే తల్లీబిడ్డ ఇద్దరికీ ప్రయోజనం ఉంటుంది.

కుంకుమ పువ్వును తీసుకుని దాన్ని ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో కలిపి రోజుకు ఉదయం, సాయంత్రం రెండు సార్లు తాగొచ్చు. రాత్రి నిద్రకు ముందు తాగాలి. ఉదయం అయితే బ్రేక్ ఫాస్ట్ చేశాక తాగాలి. రోజుకు ఒక్కసారి తీసుకున్నా మంచిదే.