మహిళలూ..వింటర్ లో ఎటువంటి ఫుడ్ తినాలో మీకు ఐడియా ఉందా?

Ladies do you have any idea what to eat in winter?

 

చాలామంది రెగ్యులర్ గా ఫుడ్ తీసుకుంటారు కానీ సీజన్ బట్టి ఎలాంటి ఫుడ్ తినాలో తెలియదు. దీంతో వారి మెనూ ఎప్పుడూ రొటీన్ ఫుడ్ ఉంటుంది. కాకపోతే సీజనల్ ఫ్రూట్స్ యాడ్ చేస్తారు. అయితే అదొక్కటే చాలదట. శరీరానికి సీజన్ బట్టి పోషకాల అవసరం మారుతూ ఉంటుందట.

ముఖ్యంగా మహిళలు ఈ విషయంతో తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబతున్నారు. ఎందుకంటే వయసు పైబడుతన్న కొద్ది వారికి పోషకాల అవసరం అధికంగా ఉంటుంది. జీవనశైలిలో మార్పుల కారణంగా, చర్మం, జుట్టు, ఎముకలకు సంబంధించిన సమస్యలు మహిళలకు సాధారణం. తరచుగా మహిళలు వెన్ను, కాళ్లలో నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. చలికాలంలో మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు ఏయే ఆహారపదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలో తెలుసుకుందాం.

విటమిన్ సి..

విటమిన్ సి కోసం, మీరు నారింజ, నిమ్మ, కివి, బొప్పాయి, జామ మొదలైన సిట్రస్ పండ్లను తీసుకోవచ్చు. వాటిలో విటమిన్ సి ఉంటుంది. మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది మన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. చలికాలంలో వచ్చే వ్యాధులను దూరం చేస్తుంది.

ఆకుపచ్చ కూరగాయలు..

ఆకుపచ్చని కూరగాయలలో మన శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూర, ఉదాహరణకు ఇందులో విటమిన్లు A , C అధికం. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. శీతాకాలంలో వచ్చే ఆకు కూరలు మరే సీజన్ లోనూ రావు. అందుకే వీలయినంత ఎక్కువగా ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

గరం మసాలా..

కుంకుమపువ్వు, పసుపు, దాల్చినచెక్క , ఏలకులు వంటి భారతీయ మసాలా దినుసులు చలికాలంలో శరీరానికి అవసరమైన వేడిని అందిస్తాయి. ఇది కాకుండా జలుబు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధులను నివారించడానికి పనిచేస్తాయి. ఈ మసాలా దినుసులను అనేక విధాలుగా తీసుకోవచ్చు. వీటిని రకరకాల పానీయాలలో కలుపుకొని తాగవచ్చు.

డ్రై ఫ్రూట్స్ ..

డ్రై ఫ్రూట్స్‌ చల్లని వాతావరణంలో వేడిని పుట్టిస్తాయి. ఖర్జూరం, అత్తి పండ్లు శీతాకాలం లో తినే డ్రై ఫ్రూట్స్‌లో ముఖ్యమైనవి. ఈ రెండిటిలో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం శక్తి స్థాయిని పెంచడంలో సహాయపడతాయి. సాధారణంగా గోరువెచ్చని పాలతో తీసుకుంటే చాలా మంచిది.

నెయ్యి వాడటం..

చలికాలంలో తీవ్రమైన చలి వల్ల చర్మం జుట్టు పొడిబారుతుంది. దీనికి శరీర పోషణకు అవసరమైన నెయ్యితో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. దీంతో పాటు పోషకాహారాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా నెయ్యిని తీసుకోవాలి. చల్లని వాతావరణంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి నెయ్యి పనిచేస్తుంది.