
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు.. లాలూ ప్రసాద్ బెయిల్ కోసం హైకోర్టు కు దాఖలు చేసినారు కానీ అ పిటిషన్ను ఝార్ఖండ్ హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు 2 నెలల అనంతరం మళ్లీ కొత్తగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని తెలియజేసింది. లాలూ ప్రసాద్ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ. 3.13 కోట్లు డుమ్కా ఖజానా నుంచి అక్రమంగా విత్ డ్రా చేసారని ఎప్పటి నుంచో ఆయనపై హైకోర్టు విచారణ కొనసాగిస్తోంది. 2017 డిసెంబర్ నుంచి లాలు దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవల లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు అని కిడ్నీ 25శాతం మాత్రమే పనిచేస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.