పశ్చిమ బెంగాల్ లో మళ్ళీ నాయకులు పోరుకు సిద్ధం!!

West Bengal By-Election Latest News

 

పశ్చిమ బెంగాల్ లో బై పోల్స్ దగ్గర పడుతున్నందున మళ్ళీ రాజకీయం వేడందుకుంది. మమత గత ఎలక్షన్ లో మొదట భోవణిపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేద్దామనుకున్నా తనను కాదనుకొని బీజేపీ లో చేరిన సువెందు అధికారిని ఎలాగైనా ఓడించాలానే ఉద్దేశం తో నందిగ్రామ్ నుండి పోటీ చేసి ఘోర పరభావం పాలయిన విషయం అందరికి తెలిసిందే.

ఇప్పుడు బై పోల్స్ సందర్భంగా భోవణిపూర్ నుండి మమత మళ్ళీ పోటీకి దిగుతున్న నేపథ్యంలో లో బీజేపీ ఎలాగైనా మామాతను ఓడించాలని చూస్తుంది.

ఇదే విషయంపై సువెందు అధికారి స్పందిస్తూ ఒకవేళ బీజేపీ నన్ను పోటీ చేయమ్మన్నా మళ్ళీ మమతాను ఒడిస్తానని, MLA గా గెలవలేని వాళ్ళు బెంగాల్ CM గా ఉండటానికి అర్హులు కారని ఎద్దెవా చేసారు. ఇప్పటికే కాంగ్రెస్ తను ఏ అభ్యర్థినీ భోవణిపూర్లో నిలబట్టమని చెప్పడంతో మళ్ళీ ఇక్కడ బీజేపీ vs టీఎంసీ మధ్యే పోటీ ఉండబోనుంది.