వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ ను జీ దక్కించుకుంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా నుంచి విడుదలైన సాంగ్, పవన్ లుక్స్ సినిమా పై భారీ అంచనాలు పెంచాయి. సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించి శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ సంస్థ జీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 15 కోట్ల రూపాయల వరకూ ఈ డీల్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ముందుగా జెమినీ వారు ఈ రైట్స్ కోసం పోటీ పడినప్పటికీ ఆ తరువాత వెనక్కి తప్పుకుంది. ప్రస్తుతం జీతెలుగు ఈ హక్కులను సొంతం చేసుకుంది.