ప్రముఖ సినీ నటి జయంతి 75 కన్నుమూత

బ్రేకింగ్….

ప్రముఖ సినీ నటి జయంతి 75 కన్నుమూత

కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నటి జయంతి

ఆమె ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో బెంగుళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు

జయంతి గత 35 సంవత్సరాల నుంచి అస్తమా సమస్యతో బాధపడుతున్నారు

జయంతి 1945 జనవరి 6న బళ్ళారి లో జన్మించారు

కన్నడ సినిమా జెను గూడు(1963)తో తెరంగేట్రం చేసిన జయంతి అనేక హిందీ, మరాఠీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించారు.

ఇప్పటి వరకు దాదాపు 500పైగా సినిమాల్లో నటించిన ఈమె 300 సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు.

తెలుగులో భార్య భర్తలు సినిమాతో కెరీర్ ప్రారంభించి, జగదేక వీరుడి కథ, డాక్టర్ చక్రవర్తి, జస్టిస్ చౌదరీ, దొంగ మొగుడు, కొదమ సింహం, పెదరాయుడు, సైరా నర్సింహారెడ్డి చిత్రాల్లో నటించారు.