
ఉత్తమ బౌలింగ్ పెర్ఫార్మన్స్ తో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కు చెమటలు పట్టించిన భరత్ బౌలర్స్.
ఆఖరి రోజు డ్రా దిశగా వెళ్తున్న మ్యాచ్‌ను అనుకోని విధంగా బూమ్ బూమ్ బుమ్రా తన బౌలింగ్ తో ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్స్లను బోల్తా కొట్టించాడు. మధ్యలో ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ మరియు అల్ల్రౌండర్ వోక్స్ సాయంతో మంచి పార్టనర్షిప్ తో మ్యాచ్ ను నిలబెట్టే ప్రయత్నం చేసినా షార్దుల్ కెప్టెన్ రూట్ ని బౌల్డ్ చేసి మ్యాచ్‌ను ఇండియా గెలుపు వైపు మాలిపాడు.
ఈ మ్యాచ్ లో ఉమేష్ ఆరు వికెట్లు బుమ్రా, జడేజా నాలుగు వికెట్లు మరియు సిరాజ్ ఒక వికెట్ తో మంచి ప్రదర్శన చేసారు. రెండు ఇన్నింగ్స్ లో అర్ధ శాతకాలు చేసి 3వికెట్స్ తో షార్దుల్ మంచి అల్రౌండ్ ప్రదర్శన కనపరిచాడు. 2వ ఇన్నింగ్స్ లో అద్భుత శతకం తో ఆకట్టుకున్న రోహిత్ శర్మకు మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ గెలుపుతో భరత్ 5 మ్యాచ్‌ల సీరీస్ లో (భరత్ 2 – ఇంగ్లాండ్ 1) ఆదిక్యం లోకి వెళ్ళింది. సెప్టెంబర్ 10వ తారీకున జరిగే ఆఖరి మ్యాచ్ లో ఇండియా డ్రా చేసినా సెరీస్ కైవసం చేసుకోగలుగుతుంది. ఆలా జరిగితే ఇంగ్లాండ్ గడ్డ పై భారత్ ది ఇది మొట్టమొదటి టెస్ట్ సెరీస్ విజయంగా చరిత్రకి ఎక్కుతుంది.