మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష, అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా నిన్న యూసుఫ్‌గూడా గణపతి కాంప్లెక్స్ దగ్గర సినిమా, టీవీ కళాకారులను ప్రకాష్ రాజ్‌తో పాటు ఆయన ప్యానెల్ సభ్యులు కలిశారు. ఈ మధ్యాహ్నం జేఆర్సీ కన్వెన్షన్‌లో మా సభ్యులను లంచ్‌కు ఆహ్వానించారు ప్రకాష్ రాజ్. అటు రెండు మూడు రోజుల్లో మంచు విష్ణు ప్యానెల్‌ను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మా సభ్యులను ప్రసన్నం చేసుకునేందుకు అటు ప్రకాశ్ రాజ్, ఇటు మంచు విష్ణు తీవ్రంగా కృషి చేస్తున్నారు.