
మహేష్ బాబు – శ్రీనువైట్ల కాంబోలో 2011 లో వచ్చిన దూకుడు చిత్రం మంచి విజయం సాధించింది. ఈ మూవీ తరువాత వీరియిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆగడు ప్లాప్ అయింది. ఇక అక్కడి నుండి శ్రీనువైట్లకు డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్నాడు శ్రీనువైట్ల.
ఒక హిట్ కొట్టాలన్న కసితో ఢీ మూవీకి సీక్వెల్ తో రాబోతున్నాడు. అంతేకాదు ఇప్పుడు దూకుడు మూవీకు కూడా సిక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. శ్రీనువైట్ల ఇప్పటికే దూకుడు సిక్వెల్ కోసం కథ సిద్ధం చేసుకున్నాడని, మహేష్ బాబు అవకాశం ఇస్తే కథ వినిపించాలన్న ఆలోచనతో ఉన్నారని ఇండస్ట్రీలో టాక్.