మోహన్ లాల్ సినిమాలో మంచు లక్ష్మీ

Manchu Lakshmi in Mohanlal movie

 

మలయాళ సినీ ఇండస్ట్రీ సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం మాన్ స్టర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే.. మాన్ స్టర్ సినిమాలో మంచు లక్ష్మీ నటిస్తున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ న్యూస్ నిజమేనంటూ మంచు లక్ష్మీ తన సోషల్ మీడియాలో అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో మోహన్ లాల్ కు భార్యగా నటిస్తుందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ప్రస్తుతం ఈమె చేసిన ట్వీట్ నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది. మోహన్ లాల్ మాన్ స్టర్ పోస్టర్ ను షేర్ చేసిన మంచు లక్ష్మీ. ఫైనల్లీ క్యాట్ బ్యాగ్ బయటకు వచ్చింది. కొత్త భాష, కొత్త జోనర్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాను. చాలా ఎగ్జైట్ మెంట్ తో ఉన్నాను. నా ఫస్ట్ మలయాళ మూవీ.. నాకు చాలా ఇష్టమైన సూపర్ స్టార్ మోహన్ లాల్ తో వర్క్ చేయబోతున్నాను. ఈ సినిమాను చేయడానికి చాలా ఆసక్తిగా ఉందని, అలాగే మీ ముందుకు తీసుకురావడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు మంచు లక్ష్మీ ట్వీట్ చేసింది.

అలాగే ఈ సినిమాలో మంచు లక్ష్మీ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందట. ఈ సినిమాలో లక్కీ సింగ్ పాత్రలో మోహన్ లాల్ కనిపిస్తున్నారు. సీరియస్ లుక్ లో ఉన్న మోహన్ లాల్ పోస్టర్ విపరీతంగా వైరల్ అవుతుంది. అలా ఈ సినిమా ఒక సీరియస్ యాక్షన్ డ్రామా అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు.

అలాగే ఇప్పటివరకు మోహన్ లాల్ యాక్ట్ చేసిన పాత్రలు చాలా సెలెక్టివ్ గా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ సినిమా కోసం మలయాళం సినీ ప్రేక్షకులతో పాటుగా తెలుగు ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు.