మంచు మనోజ్ తీరు ఎవరికీ అర్థం కాకపోవడానికి కారణాలేంటి

Manchu Manoj Meets Jagan And Pawan

 

మంచు మనోజ్.. మా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయంటే దానికి కారణం మంచు మనోజ్ ప్రముఖ పాత్ర పోషించాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మాటలు ప్రకాష్ రాజ్ టీమ్ సభ్యులు చెప్పడం సర్ ప్రైజ్ గా అనిపిస్తున్నాయి. అధ్యక్ష స్థానం కోసం పోటీ పడిన విష్ణు హడావిడి చేశారు గానీ మనోజ్ అంతగా ఫోకస్ చేయలేదు. మీడియా సమావేశంలో మాత్రం మనోజ్ మా ఎన్నికల్లో ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరించారని ప్రముఖులు మెచ్చుకున్నారు. మంచు కుటుంబానికి, మనోజ్ కు అసలు ఎలాంటి పొంతన ఉండదని అంటున్నారు. లేటెస్ట్ జరిగిన మరికొన్ని సంఘటనలు ఈ మాట వాస్తవం అనిపించేలా ఉన్నాయి. మా ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన పవర్ స్టార్ వెన్నంటే ఉండి.. ఆయన భుజంపై పవన్ చేయి వేసి ఉండటం చాలామందిని ఆశ్చర్యపరిచింది.

మా ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ ను భీమ్లా నాయక్ షూటింగ్ సెట్ లో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మంచు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి సరైన రిలేషన్ లేదని టాక్ వినిపిస్తున్న వేళ.. పవన్ కళ్యాణ్ ను మనోజ్ ఎందుకు కలిశారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే వీరికి క్లోజ్ ఫ్రెండ్స్ చెబుతున్న మాట ఏంటంటే.. నంద్యాలకు చెందిన భూమా అఖిలప్రియ, పవన్ కళ్యాణ్ జనసేనలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని.. ఈ విషయంలో మంచు మనోజ్ మధ్యవర్తిగా వ్యవహరించడానికి ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. ఇదే క్రమంలో మనోజ్, ఏపీ సీఎం జగన్ ని కలవడం మరో హైలెట్. దీంతో మంచు మనోజ్ ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి తెలీదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.