మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి..?

maoist leader ramakrishna alias RK Passed Away

 

మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత నలభై సంవత్సరాలుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న ఆర్.కె అలియాస్ రామకృష్ణ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 4 దశాబ్దాలపాటు మావోయిస్టు పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన ఆర్కె ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. 2004 డిసెంబర్ లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో జరిగిన చర్చలకు మావోయిస్టు తరఫున ఆర్కె ప్రధానంగా హాజరయ్యారు. అంతకుముందు అలిపిరి వద్ద చంద్రబాబు పై హత్యాయత్నం కేసులో కూడా ఆర్కె ప్రధాన నిందితుడు. ఇప్పటికే కోటి రూపాయల రివార్డును పోలీసులు ప్రకటించారు.

ఆర్కే మృతిని మావోయిస్టులు ధ్రువీకరించినప్పటికీ దాదాపు ఈ వార్త నిజమే అని తెలుస్తోంది. ఆర్ కె అలియాస్ అక్కిరాజు హరగోపాల్ మృతి వార్తలతో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని ఆయన స్వగ్రామం ఆలకూరపాడు లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నో ఎన్ కౌంటర్ లో నుంచి ఆర్కే తప్పించుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. వైరస్ బారిన పడి ఆర్కే మృతిచెందినట్లు గత ఏడాది కూడా పుకార్లు వచ్చాయి.