పుష్ప సినిమా నుండి అద్దిరిపోయే మాస్ అప్డేట్..

తెలుగు, మలయాళం సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా యూత్ స్టైల్ ఐకాన్ గా బ్రాండ్ సాధించారు. ఇక ఈ స్టైలీష్ హీరో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మకమైన సినిమా పుష్ప. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్లాన్ చేసి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో మోస్ట్ వాంటెడ్ విలన్ గా పవర్ పాక్డ్ లాంటి పర్ఫార్మెన్స్ ని అందించనున్నారు.

ఈ సినిమాపై బన్నీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఓ సూపర్ హిట్ అప్డేట్ వచ్చేసింది. పుష్ప సినిమా నుండి ఓ మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు ఫిల్మ్ టీమ్. ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పుట్టినరోజున ఈ పాటను విడుదల చేయడం విశేషం. అయితే ఇది కేవలం ట్రైలర్ సాంగ్ మాత్రమే. అసలు మొత్తం సాంగ్ ని ఆగస్ట్ 13వ తేదీన రిలీజ్ చేస్తామని ఫిల్మ్ టీమ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.