మాస్టర్ మూవీ రివ్యూ

విడుదల తేదీ : జనవరి 13, 2021

రేటింగ్ : 2.75/5

నటీనటులు : విజయ్, విజయ్ సేతుపతి, మాలవికా మోహనన్, ఆండ్రియా జెరెమియా

దర్శకత్వం : లోకేష్ కనగరాజ్

నిర్మాత‌లు : గ్జావియర్ బ్రిట్టో

సంగీతం : అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫర్ : సత్యన్ సూర్యన్

ఎడిట‌ర్‌ : ఫిలోమిన్ రాజ్

ద‌ళ‌ప‌తి విజ‌య్, విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మాస్ట‌ర్ మూవీకి ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న వ‌స్తుంది. ఉద‌యం 7 గంట‌ల నుండే థియేట‌ర్లు అన్నీ ప్యాక్ అయిపోయాయి అభిమానుల కోలాహాలం అంతా ఇంతా కాదు. ఈ ఇద్ద‌రి హీరోల కాంబినేష‌న్ కు తోడు ఖైదీ వంటి బ్లాక్ బాస్ట‌ర్ త‌ర్వాత డైరెక్ట‌ర్ క‌న‌గ‌రాజ్ సినిమా కావ‌టం కూడా అంచ‌నాలు భారీగా పెంచేసింది.

తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, హిందీలో రిలీజ్ అయిన ఈ మూవీని చూసేందుకు ప్రేక్ష‌కులు పోటీప‌డ్డారు. త‌ను సంవ‌త్స‌రం త‌ర్వాత సినిమా హాల్ కు వ‌చ్చానంటూ మ‌హాన‌టి ఫేం కీర్తిసురేష్ ట్వీట్ చేశారు. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే త‌మిళ్ ప్రేక్ష‌కుల‌కు ఓకే కానీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌టం కాస్త క‌ష్ట‌మేన‌ని చెప్పొచ్చు.

ఫస్ట్ హాఫ్ తో పోల్చితే సెకండ్ హాఫ్ కాస్త డ‌ల్ గా సాగుతుంది. ఇంట‌ర్వెల్ బ్యాంగ్, విజ‌య్-విజ‌య్ సేతుప‌తి మ‌ధ్య సీన్స్ సినిమాకు హైలెట్. విజ‌య్ సేతుప‌తి ఇర‌గ‌దీశాడ‌ని చెప్పుకోవ‌చ్చు. స్టోరీ కాస్త స్లోగా ఉండ‌టం, స్లో స్క్రీన్ ప్లేతో డైరెక్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఇబ్బందిపెట్టాడ‌ని చెప్పుకోవ‌చ్చు. గ‌త కొంత‌కాలంగా సినిమాపై అంచ‌నాలున్నంత సినిమా లేక‌పోయినా బొమ్మ యావ‌రేజ్ అని చెప్పుకోవ‌చ్చు.