నటుడు సత్యదేవ్ ను వరించిన మెగా ఛాన్స్..

టాలీవుడ్ నటుడు సత్యదేవ్ గొప్ప ఆర్టిస్ట్ గా ఎదిగారు. తనలో ఉన్న వినూత్నమైన నటనతో ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాతో ఇంకాస్త క్రేజ్ సంపాదించుకున్నారు. ఓటీటీల్లో రిలీజైన వెబ్ సిరీస్ లో నటించి మంచి మార్కులు సొంతం చేసుకున్నారు. ఇక బ్లఫ్ మాస్టర్ లో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఎన్నో విభిన్నమైన క్యారెక్టర్లతో యంగ్ అండ్ డైనమిక్ హీరోగా సత్యదేవ్ ఎదిగారు. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ ఇలా ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే ఓ ఇంటిలిజెంట్ నటుడు సత్యదేవ్. ప్రస్తుతం ఈయన్ను వరుస ఆఫర్లు ఆహ్వానిస్తున్నాయి.

రీసెంట్ గా మెగా ఫ్యామిలీ నుండి ఓ అద్భుతమైన ఆఫర్ సత్యదేవ్ ని వరించినట్లు తెలుస్తుంది. అదీ కూడా మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ లో సత్యదేవ్ కూడా యాక్ట్ చేయబోతున్నారు. మోహన్ రాజా డైరెక్షన్ లో ఈ సినిమాలో సత్యదేవ్ పాత్ర రివీల్ అయ్యింది. లూసిఫర్ సినిమాలో వివేక్ ఒబెరాయ్ పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఫుల్ ఆటిట్యూడ్ తో విలన్ పాత్రలో ఒదిగిపోనున్నారు సత్యదేవ్. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఈ రీమేక్ సినిమా వచ్చే నెల నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది.