మా’ ఎలక్షన్ లో మంచు విష్ణుకి సపోర్ట్ గా మెగాస్టార్ నిలుస్తారా?

Megastar Support of Manchu Vishnu in MAA Elections

 

ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మా ఎలక్షన్ బజ్ ఎక్కువగా ఉంది. అక్టోబర్ 10 న ఎలక్షన్ హడావిడిలో ఉన్నారు. ఇక మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ లు పోటీ చేస్తున్నారు. మా ఎలక్షన్లు సాధారణ రాజకీయ పోటీలుగా భావిస్తున్నరు. లేటెస్ట్ గా రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ తో ఈ చర్చలు మరింత వేడెక్కాయి. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ లు తమ ప్యానల్ మెంబర్స్ లిస్ట్ ని రిలీజ్ చేశారు. వాడివేడిగా ఒకర్ని ఒకరూ దూషించుకుంటూ, ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేస్తూ ప్రచారాలు చేసుకుంటున్నారు.

లేటెస్ట్ గా మంచు విష్ణు మాట్లాడుతూ మా ఎన్నికల్లో మెగాస్టార్ ఓటు తనకే వస్తుందని, ఆయన తనకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నామినేషన్ వేసిన తర్వాత చిరంజీవిని కలుస్తామని, ఖచ్చితంగా చిరంజీవి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ తో పోల్చితే మా అభివృద్ధి కోసం శ్రమిస్తానని అన్నారు. మా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ‘మా’అభివృద్ధి కోసం అప్పు చేసైనా సొంత భవనాన్ని కట్టిస్తానని అన్నారు. అలాగే మా సభ్యుల పిల్లల ఎడ్యూకేషన్ కి కూడా సరైన ప్రణాళిక ఉందని, మరిన్ని విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మా అధ్యక్ష పదవికి పోటీ జరుగుతుంది.

ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ కి నాగబాబు, పవన్ కళ్యాణ్, మరికొంతమంది సపోర్ట్ ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే మంచు విష్ణుకు సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబులతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోల సపోర్ట్ తో ముందుకు నడుస్తున్నారు. ఇక లేటెస్ట్ గా మంచు విష్ణు చెప్పినట్లు చిరంజీవి సపోర్ట్ తనకే ఉంటుందని అనడం గమనార్హం. సినీ ఇండస్ట్రీలో మరో పెద్ద కృష్ణంరాజు సపోర్ట్ ఎవరికి ఉంటుందనేది తెలియాలి