అద్దిరిపోయే క్వాలిటీతో మెస్మరైజ్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ గ్లింప్స్

Mesmerizing RRR Glimpses with stunning quality

 

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వస్తుంది. లేటెస్ట్ గా ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. ఎప్పట్నుండో వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇదొక బిగ్గెస్ట్ అప్డేట్. ఈ గ్లింప్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఎంట్రీతో పాటుగా అజయ్ దేవగణ్, ఆలియా భట్ లుక్స్ ని చూపించారు. ఈ గ్లింప్స్ రిలీజ్ తో ఒక్కసారిగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

ఈ గ్లింప్స్ లో రాజమౌళి టెక్నికల్ వ్యాల్యూస్ తో పాటు విజువల్స్ కూడా హైలెట్ అయ్యాయి. ఈ సినిమాలో క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదని రాజమౌళి గతంలోనే తెలిపారు. అలాగే ఎక్కడా రాజీ పడకుండా అద్దిరిపోయే విజువల్స్ తో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలరిస్తారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై మొదట్నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.