అర్ధరాత్రి హై డ్రామా

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్టు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. తనపై దాడి చేసి హత్యాయత్నం చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జి.కొండూరు పోలీస్ స్టేషన్ ఎదుట దేవినేని ఆందోళన చేపట్టారు. సుమారు 6 గంటల పాటు కారులోనే ఉండి నిరసన వ్యక్తం చేశారు. అయితే దేవినేని ఉద్దేశ్య పూర్వకంగానే రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆరోపిస్తూ పోలీసులు దేవినేని ఉమామహేశ్వరరావు ను అరెస్టు చేశారు. కారు అద్దాలు పగులగొట్టి దేవినేని ని అదుపులోకి తీసుకుని… పెదపారుపూడి స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత ఈ తెల్లవారుజామున నందివాడ స్టేషన్ కు మార్చారు. దాడి చేసిన వారిని వదిలేసి… బాధితులపై కేసులు ఎలా పెడతారని తెలుగు దేశం పార్టీ నేతలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు.